‘సంబరాల ఏటిగట్టు‘ అసుర ఆగమన గ్లింప్స్

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిదుర్గ తేజ్ వరుసగా ‘విరూపాక్ష, బ్రో’ వంటి విజయాలను అందుకున్నాడు. ఈ సక్సెస్ ను ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఈసారి మామూలు సినిమా కాదు.. పాన్ ఇండియా రేంజ్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు‘తో వస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కె.పి. తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈరోజు సాయిదుర్గా తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ ఆద్యంతం గూస్ బంప్స్ విజువల్స్ తో నిండిపోయింది. ‘ముసుర సంధ్యవేళ మొదలైంది, రాక్షసుల ఆగమనం‘ అంటూ బీస్ట్ మోడ్ లో సాయి రెచ్చిపోతున్న విజువల్స్ ఈ గ్లింప్స్ కు హైలైట్. భారీ బడ్జెట్ తో ‘హనుమాన్‘ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్తగా మేకోవర్ అయ్యాడు సాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఈ మూవీకి టెక్నికల్ గా మరో ప్లస్ పాయింట్. మొత్తంగా.. సాయితేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ‘సంబరాల ఏటిగట్టు‘ రెడీ అవుతుంది.
-
Home
-
Menu