అల్లు బిజినెస్ పార్క్‌పై జీహెచ్ఎంసీ కత్తి!

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కఠిన వైఖరి కొనసాగుతోంది. సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కొరడా ఝులిపిస్తోంది. తాజాగా ఈ కొరడా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్‌పై పడింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో సుమారు 1000 గజాల విస్తీర్ణంలో ‘అల్లు బిజినెస్ పార్క్’ అనే వాణిజ్య భవనాన్ని అల్లు కుటుంబం నిర్మించింది.
ఈ ప్రాజెక్టు 2023 నవంబర్‌లో, దివంగత నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు నాలుగు అంతస్తులకు అన్ని అనుమతులు తీసుకొని ఏడాది క్రితమే ఈ భవనం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి.
అయితే, తాజాగా అల్లు కుటుంబం అనుమతులు లేకుండా ఈ భవనంపై అదనంగా ఒక పెంట్‌హౌస్ నిర్మించిందని జీహెచ్ఎంసీ గుర్తించింది. వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగి, ఈ పెంట్‌హౌస్ అక్రమమని తేల్చి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘అనుమతులు లేకుండా నిర్మించారంటే దీన్ని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలి. లేకపోతే చట్టప్రకారం కూల్చివేస్తాం‘ అని జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు స్పష్టం చేశారు.
-
Home
-
Menu