'ఓజీ' నుంచి 'గన్స్ అండ్ రోజెస్'

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ విడుదలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘ఫైర్ స్టార్మ్, సువ్వి సువ్వి’ పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, లేటెస్ట్ గా మరో పవర్‌ఫుల్ సాంగ్ ‘గన్స్ అండ్ రోజెస్’ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
మొదట ‘హంగ్రీ చీతా’ గ్లింప్స్‌లో బిట్‌గా వినిపించిన ఈ పాటను పూర్తి స్థాయిలో అందించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. అద్వితీయ సాహిత్యంలో హర్ష పాడిన ఈ ర్యాప్ లో తమన్ ఇచ్చిన మాస్ బీట్స్ మరింత ఎలివేట్ చేశాయి. సెప్టెంబర్ 18న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 20న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ అయ్యి మంచి స్పందన వస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, హరిష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజీత్ తెరకెక్కించాడు. పవన్ స్టైల్, డైలాగ్ డెలివరీ, తమన్ బీజీఎం కలిసి ఈ సినిమాను భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలపబోతున్నాయని అభిమానులు నమ్ముతున్నారు.
-
Home
-
Menu