ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినిమా ప్రేక్షకులను తన ప్రత్యేకమైన హాస్యం, తెలంగాణ యాసతో మెప్పించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (53) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.
వెంకట్‌కి గత కొన్ని నెలలుగా డయాలసిస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కిడ్నీలు పూర్తిగా పని చేయకపోవడంతో వైద్యులు ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఉందని చెప్పారు. అయితే ఆర్థిక అకాలత కారణంగా ఆయన కుటుంబం సాయం కోసం ఎదురు చూసింది. కొంతమంది సహాయహస్తం అందించినా, అవసరమైన మొత్తం లభించకపోవడం దురదృష్టకరం. చివరకు, చికిత్స ఫలించకపోవడంతో ఆయన మృతిచెందారు.
వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేశ్. ప్రారంభంలో చేపల వ్యాపారం చేయడంతో ‘ఫిష్ వెంకట్’గా పిలువబడతారు. 1991లో ‘జంతర్ మంతర్’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన, 2002లో ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమాలో ‘తొడ కొట్టు చిన్నా’ డైలాగ్‌తో విశేష గుర్తింపు పొందారు.
‘బన్నీ’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘డీజే టిల్లు’ తదితర చిత్రాల్లో విలన్ సైడ్ కమెడీగా తనదైన ముద్రవేశారు. వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన చివరిసారిగా 'కాఫీ విత్ ఎ కిల్లర్' అనే చిత్రంలో కనిపించారు. ఫిష్ వెంకట్ మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు సోషల్ మీడియాలో నివాళులర్పిస్తున్నారు.
-
Home
-
Menu