మే నెలలో సినిమాల జాతర!

ఈ వేసవి మామూలుగా ఉండదనిపిస్తోంది. మే నెలలో తెలుగు సినీ ప్రియులకు థియేటర్లలో అసలైన పండుగే నెలకొనబోతోంది. ఒక్కో స్టార్ హీరో తమ యూనిక్ జానర్ సినిమాలతో రంగంలోకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద అసలైన పోటీ చూడబోతున్నాం.
మే నెలలో ముందుగా నేచురల్ స్టార్ నాని ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తన సిగ్నేచర్ శైలిని కొనసాగిస్తూ 'హిట్ 3'తో వస్తున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా, గత హిట్ సిరీస్‌కు సీక్వెల్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఇది మరో సేఫ్ బెట్ గా మారుతుందా అనేది చూడాలి. మే 1న 'హిట్ 3' థియేటర్లలోకి వస్తోంది.
విలక్షణ నటుడు సూర్య ఈసారి 'రెట్రో' అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాతో మాస్ అటెంప్ట్ చేశాడు. 'కంగువ' చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో, ఈ సినిమాతో మాత్రం బాక్సాఫీస్ మీద తిరుగులేని స్టేట్‌మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడు. టైటిల్‌లోనే నమ్మకాన్ని కలిగిస్తున్న ఈ మూవీ 80ల మాఫియా మాయాజాలాన్ని తెరపై ఆవిష్కరించబోతోంది. మే 1నే 'రెట్రో' కూడా రిలీజవుతుంది.
'హిట్ 3, రెట్రో' వచ్చిన వారానికి థియేటర్లలోకి రాబోతుంది 'హరిహర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ఇది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా ఆయన అభిమానులకే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తోంది. షూటింగ్ లేటైనప్పటికీ, మే లో మాత్రం పక్కా విడుదలని మేకర్స్ ధీమాగా చెప్పారు. మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' అనే పీరియడ్ యాక్షన్ మూవీతో మే చివరిలో వస్తున్నాడు. ఈ మూవీతో తన ఫ్లాప్ లకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. భారీ బడ్జెట్, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమా విజయ్ కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ కావాలని అతడే కాదు, అభిమానులూ ఆశిస్తున్నారు. సితార సంస్థలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న 'కింగ్‌డమ్' మే 30న రిలీజ్ కు రెడీ అవుతుంది.
చారిత్రక కథాంశంతో పవన్, సైకాలాజికల్ థ్రిల్లర్‌తో నాని, మాఫియా మసాలాతో సూర్య, పీరియడ్ యాక్షన్‌తో విజయ్.. మొత్తంగా మే నెలలో వస్తోన్న నాలుగు సినిమాలూ వేర్వేరు జానర్స్‌లో ఉండటం విశేషం. మొత్తంమీద.. ఈ వేసవి తెలుగు ప్రేక్షకులకు థియేటర్లలో పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ హంగామా ఉండబోతుంది!
-
Home
-
Menu