నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ

నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
X
తెలుగు చిత్ర పరిశ్రమలో వేతనాల పెంపు అంశం తీవ్ర రూపం దాల్చింది. సోమవారం (ఆగస్ట్ 4) నుంచి 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్పష్టం చేయగా, దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఫెడరేషన్ డిమాండ్‌ను ‘పక్షపాత నిర్ణయం’గా అభివర్ణించిన ఛాంబర్ గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, నిర్మాతలకు ఓ లేఖ విడుదల చేశారు. అందులో ప్రస్తుతం చట్టాల ప్రకారం ఇప్పటికే కార్మికులకు కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామన్నారు. ఈ బంద్ నిర్మాణంలో ఉన్న సినిమాలకు నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.

నిర్మాతలు ఫెడరేషన్‌తో ఎటువంటి ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకూడదని, ఛాంబర్ జారీ చేసే మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ఈ అంశంపై సరైన పరిష్కారం కోసం సోమవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో అత్యవసర నిర్మాతల సమావేశం జరగనుంది.

Tags

Next Story