
‘ఫౌజీ’ రిలీజ్ డేట్ లాక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘డ్యూడ్’ ప్రమోషన్స్‌లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ స్వయంగా ఈ అప్‌డేట్ ఇచ్చారు. 'ఫౌజీ'ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్‌పోన్ చేసే ఆలోచన లేదు. ఆగస్టులోనే రిలీజ్ అవుతుంది. షూటింగ్ కూడా దానికి అనుగుణంగా పూర్తి చేస్తాం' అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెలలో ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ గా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారట.
1940ల నాటి పీరియాడిక్ వార్ డ్రామా నేపథ్యంలో హను రాఘవపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రభాస్ ఇందులో ఓ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ‘సీతా రామం’ తరహాలో ఎమోషనల్ టచ్, విజువల్ గ్రాండియర్ కలగలిపిన కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ బ్యూటీ జయప్రద కీలక పాత్రల్లో నటిస్తుండగా, హీరోయిన్‌గా కొత్తమ్మాయి ఇమాన్వీ పరిచయమవుతోంది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
-
Home
-
Menu