కీలక షెడ్యూల్ కోసం ‘ఫౌజీ‘

కీలక షెడ్యూల్ కోసం ‘ఫౌజీ‘
X
పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్స్ లో అగ్రపథంలో నిలుస్తాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రాలలో ‘ది రాజా సాబ్, ఫౌజీ‘ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి.

పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్స్ లో అగ్రపథంలో నిలుస్తాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రాలలో ‘ది రాజా సాబ్, ఫౌజీ‘ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ‘రాజా సాబ్‘ ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవలే ఫారెన్ నుంచి వచ్చిన ప్రభాస్ ఈ సినిమాకోసం డబ్బింగ్ చెబుతున్నాడట.

మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ‘ కోసం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. నెలన్నర రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ‘ఫౌజీ‘ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి నటిస్తుంటే.. కీలక పాత్రల్లో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి వారు కనిపించబోతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు జరిగే కీలక షెడ్యూల్ తో దాదాపు పూర్తవుతుందట. ఆ తర్వాత ‘ది రాజా సాబ్‘ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి.. ‘స్పిరిట్‘ కోసం రంగంలోకి దిగుతాడట ప్రభాస్. ఆ తర్వాత క్రేజీ సీక్వెల్స్ ‘కల్కి 2, సలార్ 2‘ చిత్రాలు కూడా ప్రభాస్ కిట్టీలో ఉన్నాయి.

Tags

Next Story