పవన్ కోసం రంగంలోకి దుల్కర్!

పవన్ కోసం రంగంలోకి దుల్కర్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూలై 24న విడుదలకు సిద్ధమైంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూలై 24న విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు.

ఈ సినిమాను మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయబోతుండటం విశేషం. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దుల్కర్ తన సొంత బ్యానర్ వేఫారర్ ఫిలిమ్స్ ద్వారా మలయాళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

'మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్' వంటి చిత్రాల ద్వారా తెలుగు మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించిన దుల్కర్ సల్మాన్, ఈ విడుదల ద్వారా తెలుగు సినిమాలకు కేరళలో మరింత మార్కెట్ కల్పించేందుకు దోహదపడుతున్నాడు. 'హరిహర వీరమల్లు' ద్వారా దుల్కర్ - పవన్ కలయికకు మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంగా రూపొందిన ఈ ఫిక్షనల్ మూవీలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్‌ గా అలరించనుండగా.. నిధి అగర్వాల్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Tags

Next Story