'కింగ్డమ్' కోసం దుల్కర్!

కింగ్డమ్ కోసం దుల్కర్!
X
టాలీవుడ్ లో 'కింగ్డమ్' ఫీవర్ స్టార్ట్ అయ్యింది. మరో ఐదు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

టాలీవుడ్ లో 'కింగ్డమ్' ఫీవర్ స్టార్ట్ అయ్యింది. మరో ఐదు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ తిరుపతిలో జరుగుతుంది.

ఇప్పటికే ‘కింగ్డమ్’ సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేయగా, ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.


ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్‌ ‘వేఫరార్ ఫిల్మ్స్’ ద్వారా విడుదల చేయనుండడం మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. మరోవైపు, అమెరికా ప్రీమియర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే USA లో 100K డాలర్స్ పైగా ప్రీ సేల్స్ నమోదు కావడం విశేషం.



Tags

Next Story