లాంగ్ షెడ్యూల్ లో ‘డ్రాగన్‘

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కేజీఎఫ్, సలార్‘ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన నీల్, ఇప్పుడు ‘డ్రాగన్‘ ద్వారా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి కొత్త డైమెన్షన్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తయింది.
ఈనెల నుంచి లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్‌తో పాటు ఓ స్టైలిష్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారట. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడు, అందులో ఒక పాత్ర కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడని సమాచారం.
ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇటీవలే ఈ మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్ ‘‘డ్రాగన్‘ మీ ఊహలకు మించి ఉంటుంది. ఈసారి ఎలాంటి బ్రేక్ లేకుండా షూట్ పూర్తి చేస్తాం‘ అని చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో కొత్త హైప్ క్రియేట్ చేశాయి. మరో సర్‌ప్రైజ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఫిక్స్ అవ్వడం. లేటెస్ట్ గా ‘కాంతార చాప్టర్ 1‘ సక్సెస్‌తో రుక్మిణికి పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన అప్లాజ్ వస్తోంది. దీంతో.. ఎన్టీఆర్ పక్కన రుక్మిణి కెమిస్ట్రీ బాగా పండుతుందనే నమ్మకంలో అభిమానులు ఉన్నారు. వచ్చే ఏడాది జూన్ లో ‘డ్రాగన్‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu