దీపావళికి సినిమాల ధమాకా

దీపావళికి సినిమాల ధమాకా
X
2024 దీపావళి తెలుగు బాక్సాఫీస్‌కి బాగా కలిసొచ్చింది. ఆ సమయంలో విడుదలైన మూడు సినిమాలు.. దుల్కర్ సల్మాన్‌ నటించిన ‘లక్కీ భాస్కర్’, కిరణ్ అబ్బవరం ‘క’ , శివకార్తికేయన్ ‘అమరన్’.. ఒకే సమయంలో రిలీజ్ అయినప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడిచాయి.

2024 దీపావళి తెలుగు బాక్సాఫీస్‌కి బాగా కలిసొచ్చింది. ఆ సమయంలో విడుదలైన మూడు సినిమాలు.. దుల్కర్ సల్మాన్‌ నటించిన ‘లక్కీ భాస్కర్’, కిరణ్ అబ్బవరం ‘క’ , శివకార్తికేయన్ ‘అమరన్’.. ఒకే సమయంలో రిలీజ్ అయినప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడిచాయి. ఇప్పుడు 2025 దీపావళి సీజన్‌లో కూడా పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి.

ముందుగా దీపావళి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'మిత్రమండలి'. టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్స్ లో బన్నీ వాస్ ఒకరు. బన్నీ వాస్ తన సొంత బ్యానర్ BV వర్క్స్ పై ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో 'మిత్రమండలి'పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం అక్టోబర్ 16న ఆడియన్స్ ముందుకు వస్తోంది.

ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది ‘డ్రాగన్’ తో హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు దీపావళికి ‘డ్యూడ్’ చిత్రంతో వస్తున్నాడు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అక్టోబర్ 17న 'డ్యూడ్' ఆడియన్స్ ముందుకు వస్తోంది.

అక్టోబర్ 17న దీపావళి కానుకగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' రిలీజవుతుంది. నీరజ కోన డైరెక్షన్‌లో వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తమన్ అందించిన మ్యూజిక్ లోని పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. 'జాక్' ఫ్లాప్ తర్వాత 'తెలుసు కదా'తో మళ్లీ ట్రాక్ లోకి రావాలనుకుంటున్నాడు సిద్ధు.

గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ఈ దీపావళికి ‘కె-ర్యాంప్’ మూవీతో వస్తున్నాడు. యుక్తి తరేజా ఈ సినిమాలో కథానాయికగా నటించింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

దీపావళి బరిలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వస్తోన్న చిత్రం 'థామా'. సూపర్ హిట్ హారర్ సిరీస్ ‘స్త్రీ‘ యూనివర్శ్ లో భాగంగా ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 21న రిలీజవుతుంది.

Tags

Next Story