టాలీవుడ్ లో దీపావళి సందడి

టాలీవుడ్ లో దీపావళి సందడి మొదలైంది. ఈ దీపావళికి తెలుగు బాక్సాఫీస్ బరిలో నాలుగు క్రేజీ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అవే ‘తెలుసు కదా, డ్యూడ్, కె-ర్యాంప్, మిత్రమండలి’. ఈ ఒక్కో సినిమా ఒక్కో రేంజ్‌లో క్రేజ్ సృష్టిస్తోంది. వీటి బిజినెస్ లెక్కలు, అంచనాలు ఇలా ఉన్నాయి.
ఈ దీపావళి మూవీస్ లో బిజినెస్ పరంగా చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ముందు వరుసలో ఉంది. ఈ చిత్రం రెండు రాష్ట్రాలలోనూ రూ.17 కోట్ల వరకూ బిజినెస్ చేసింది. సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి లతో రొమాంటిక్ ట్రయాంగులర్ ఎంటర్‌టైనర్‌గా స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. తమన్ మ్యూజిక్ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అక్టోబర్ 17న 'తెలుసు కదా' ఆడియన్స్ ముందుకు వస్తోంది.
బిజినెస్ పరంగా 'తెలుసు కదా' తర్వాత భారీ అంచనాలు సృష్టించిన మరో చిత్రం 'డ్యూడ్'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తోన్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బిజినెస్ చేసిందట. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమిత బైజు హీరోయిన్ గా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 17నే ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
గత దీపావళి బరిలో 'క'తో ఘన విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం.. ఈ దీపావళి కానుకగా 'కె-ర్యాంప్'ను తీసుకొస్తున్నాడు. తన పేరులోని 'క' సెంటిమెంట్ ను ఈ చిత్రానికి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్లు నాన్-థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కిరణ్ కి జోడీగా యుక్తి తరేజా నటించింది. జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అక్టోబర్ 18న 'కె-ర్యాంప్' రిలీజవుతుంది.
ఇక.. దీపావళి కానుకగా ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'మిత్రమండలి'. ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అలాగే.. ఈ చిత్రాన్ని బన్నీ వాసు స్వయంగా రిలీజ్ చేయబోతున్నాడట. ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య వంటి స్టార్ కాస్టింగ్ తో ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి రేపే థియేటర్లలోకి హాట్ ఫేవరెట్ గా అడుగుపెడుతుంది 'మిత్రమండలి'.
-
Home
-
Menu