చిరంజీవి ఇంట్లో చర్చలు

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సినీ కార్మికుల సమ్మె తీవ్రతరం అవుతున్న విషయం తెలిసిందే. షూటింగ్స్ నిలిచిపోవడంతో నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆధ్వర్యంలో నిర్మాతల అత్యవసర సమావేశం జరుగుతుంది.
ఈ మీటింగ్‌కు దిల్ రాజు, సి.కళ్యాణ్, నాగవంశీ, బోగవల్లి బాపినీడు, చదలవాడ శ్రీనివాసరావు, సుప్రియ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. సమ్మెను ముగించేందుకు తక్షణ నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఫెడరేషన్ నాయకులతో మరో కీలక సమావేశం జరుగుతుంది. సినీ రంగానికి చెందిన 72 కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యలపై చిరంజీవి వారితో చర్చిస్తున్నారు. ఈ రెండు సమావేశాల తర్వాత సినీ కార్మికుల సమ్మెపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
-
Home
-
Menu