దీపికా ఎంట్రీ.. ఎగ్జిట్?

దీపికా ఎంట్రీ.. ఎగ్జిట్?
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'రాజా సాబ్, ఫౌజీ' చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, వీటి తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'రాజా సాబ్, ఫౌజీ' చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, వీటి తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తాడు. ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు.

'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా దీపికను తీసుకున్నాడట సందీప్ రెడ్డి. కానీ.. ఏమైందో ఏమో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ నుంచి దీపిక ను తప్పించినట్టు తెలుస్తోంది. దీపిక వర్కింగ్ స్టైల్ నచ్చకే 'స్పిరిట్' నుంచి తప్పించాడనే ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడంతో ఆమెను ప్రాజెక్ట్‌లోకి తీసుకోకపోవడానికి మరికొన్ని కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. దీపిక భారీ పారితోషికం, లాభాల్లో షేర్, రోజుకు కేవలం 8 గంటల పని గడువు వంటి షరతులు విధించిందట. అంతే కాదు, ఆ ఎనిమిది గంటలలో రెండు గంటలు ప్రయాణానికి వినియోగించే పరిస్థితి కూడా ఉందట. ఈ డిమాండ్లకు తాను అడ్జస్ట్ కాలేనని భావించిన సందీప్ రెడ్డి వంగా, కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టినట్లు టాక్.

దీపిక ఇటీవలే అమ్మగా మారిన విషయం తెలిసిందే. తన బిడ్డతో ఎక్కువ సమయం గడపాలనే కోరికతోనే ఆమె సినిమాలు చేసే విషయంలో ఇలాంటి షరతులు పెడుతుందట. మొత్తంగా.. 'స్పిరిట్'లో కొత్త హీరోయిన్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Tags

Next Story