థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా

X
తెలుగు సినిమా థియేటర్ల మూసివేత నిర్ణయం నిరవధికంగా వాయిదా పడినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది.
తెలుగు సినిమా థియేటర్ల మూసివేత నిర్ణయం నిరవధికంగా వాయిదా పడినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేతను తాత్కాలికంగా నిలిపివేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కీలక వర్గాలైన నిర్మాతలు (ప్రొడ్యూసర్స్), పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్స్), ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సినిమా విడుదలలకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వలన ఎదుర్కొంటోన్న ఇబ్బందులను ఇందులో చర్చించారట. ఈ అంశంపై మరింత విస్తృత చర్చ కోసం ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది.
Next Story
-
Home
-
Menu