థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా

థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా
X
జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఈ ఉదయం నుంచి వాడి వేడి చర్చలు జరిగాయి. ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశమైంది.

జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఈ ఉదయం నుంచి వాడి వేడి చర్చలు జరిగాయి. ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశమైంది. ఈ మీటింగ్ కి 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. మళ్లీ సాయంత్రం 4 గంటలకు తెలుగు ప్రొడ్యూసర్స్ తో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశమైంది.

మొత్తంగా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసివేత, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేత.. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో, ఈ సారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపిన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.

ఇప్పటికే పైరసీ, ఐపిఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు తెలిపిన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.

Tags

Next Story