సినీ ప్రముఖులతో సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో ఇటీవల బయటపడిన భారీ సినిమా పైరసీ రాకెట్‌పై నగర పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, నాగ చైతన్య, రామ్, నిర్మాత దిల్ రాజు, సురేష్ బాబు తదితరులతో అత్యవసర సమావేశం జరిగింది.
పోలీసుల దర్యాప్తులో రెండు ప్రధాన మార్గాలు బయటపడ్డాయి. థియేటర్లలో మొబైల్ ఫోన్లతో రహస్య చిత్రీకరణ, డిజిటల్ డెలివరీ సిస్టమ్స్ హ్యాకింగ్. అలాగే TamilMV, Movierulz, Tail Blasters వంటి పైరసీ పోర్టల్స్ వెనుక ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ఆపరేటర్లు ఆర్థిక లాభాలు అందిస్తున్నట్లు తేలింది. పైరసీ ఫైల్స్ టొరెంట్స్, టెలిగ్రామ్, అక్రమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
అధికారులు సూచించిన నివారణ చర్యల్లో సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు, కఠినమైన యాక్సెస్ కంట్రోల్స్, థియేటర్లలో నిఘా బలోపేతం, కంటెంట్ వాటర్‌మార్కింగ్, ఫోరెన్సిక్ పద్ధతులు ముఖ్యంగా ఉన్నాయి. పైరసీ వెబ్‌సైట్లు సినిమాలతో పాటు వీక్షకుల డేటాను కూడా దుర్వినియోగం చేస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు.
పోలీసుల ఈ చర్యలకు సినీ పరిశ్రమ ప్రముఖులు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి పైరసీ ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఈ సమావేశం కీలక మలుపుగా మారింది.
-
Home
-
Menu