'ది రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్!

ది రాజా సాబ్ నుంచి క్రేజీ అప్డేట్!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలలో 'ది రాజా సాబ్' ఒకటి. ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారి చేస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఇది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలలో 'ది రాజా సాబ్' ఒకటి. ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారి చేస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఇది. ఇలాంటి జానర్స్ ను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన మారుతి 'ది రాజా సాబ్'ను తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ లుక్స్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

అయితే గతంలో ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినా, వర్క్ ఆలస్యం కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక లేటెస్ట్ గా డైరెక్టర్ మారుతి 'ది రాజా సాబ్' నుంచి మేజర్ అప్డేట్ రాబోతుందనే హింట్ ఇచ్చాడు. 'హై అలర్ట్… మే మధ్య నుండి వేడి తరంగాలు పెరుగుతాయి' అనే క్యాప్షన్‌తో, ఓ ఆటో వెనుక ప్రభాస్ పోస్టర్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, ప్రియాంక మోహనన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జరీనా వాహబ్ తదితరులు కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రెస్టేజియస్ గా 'ది రాజా సాబ్'ను నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నుంచి రావాల్సిన చిత్రం ఇదే.

Tags

Next Story