'ఫౌజీ' నుంచి క్రేజీ అప్డేట్!

రెబెల్ స్టార్ ప్రభాస్ కిట్టీలో ఉన్న చిత్రాలు వేటికవే ఎంతో ప్రత్యేకమైనవి. జానర్స్ పరంగానూ ఒక సినిమాకి, మరో చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇక ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఫౌజీ'.
ఈ సినిమా 1940ల యుద్ధ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నాడు. నూతన భామ ఇమాన్వి డార్లింగ్ కి జోడీగా నటిస్తుంది. ఇంకా ఇతర కీలక పాత్రల్లో జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి వారు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ.700 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇప్పటికే 'ఫౌజీ' షూటింగ్ 50 శాతం పూర్తి అయ్యిందని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి షూట్ కంప్లీట్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాడట హను. అలాగే వచ్చే ఆగస్టు 15న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుందట టీమ్. మరోవైపు ఇప్పటికే 'ది రాజా సాబ్'ను ఫినిష్ స్టేజ్ కు తీసుకొచ్చి 'ఫౌజీ'ని సగం పూర్తి చేసిన ప్రభాస్.. సెప్టెంబర్ నుంచి 'స్పిరిట్'ను సెట్స్ పైకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత 'కల్కి 2, సలార్ 2' లైన్లో ఉన్నాయి.
-
Home
-
Menu