'కూలీ, వార్ 2' ఓటీటీ పార్టనర్స్!

కూలీ, వార్ 2 ఓటీటీ పార్టనర్స్!
X
ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న రెండు భారీ చిత్రాలు 'వార్ 2, కూలీ'. ఫస్ట్ డే నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా ఈ రెండు సినిమాలూ వసూళ్ల పరంగా అదరగొడుతున్నాయి.

ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న రెండు భారీ చిత్రాలు 'వార్ 2, కూలీ'. ఫస్ట్ డే నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా ఈ రెండు సినిమాలూ వసూళ్ల పరంగా అదరగొడుతున్నాయి. లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఆడియన్స్ నుంచి ఈ చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇక 'వార్ 2, కూలీ' రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గురించి, స్ట్రీమింగ్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్. రజనీకాంత్ తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం నటించిన 'కూలీ' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఈ చిత్రానికి ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ అమెజాన్ ప్రైమ్. 8 వారాల తర్వాత 'కూలీ' ఓటీటీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

మరోవైపు బాలీవుడ్‌లో యష్ రాజ్ ఫిలింస్ యాక్షన్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘వార్ 2’ కూడా రికార్డ్ స్థాయిలో ఆకట్టుకుంటోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రేజీ మల్టీస్టారర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ నెట్‌ఫ్లిక్స్. ఈ చిత్రం కూడా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Tags

Next Story