'కూలీ' ట్విట్టర్ రివ్యూ

సూపర్ స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’. ఈ మల్టీస్టారర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో 'కూలీ' ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి.
సినిమా ప్రారంభం నుంచే రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన టైటిల్ కార్డ్ ఫ్యాన్స్‌కి హైలైట్ అని చెబుతున్నారు. సినిమాలో ప్రతి నటుడి ఇంట్రో సీన్‌కి డిఫరెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం, మొదటి నిమిషం నుంచే థియేటర్‌లో ఎనర్జీ పెంచేసిందనే టాక్ వినిపిస్తుంది.
‘కూలీ’ కథలో కీలకంగా నిలిచేది ఒక ప్రత్యేక కుర్చీ. దానిలో ఒక మనిషిని ఈ లోకంలో నుంచి ఆధారాలు లేకుండా మాయం చేసే శక్తి ఉంది. దానిని సృష్టించినది సత్యరాజ్, అతని స్నేహితుడిగా రజనీకాంత్ కనిపిస్తాడు. ఈ కుర్చీ కోసం సైమన్ (నాగార్జున)తో పాటు పలు శక్తులు యుద్ధం చేస్తాయి. ఈ ప్రయాణంలో ఉమెన్ ట్రాఫికింగ్ వంటి సామాజిక అంశాలను కూడా లోకేష్ టచ్ చేశాడట.
రజనీకాంత్ తనదైన స్టైల్, మాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో స్క్రీన్‌ను డామినేట్ చేశాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక విలన్ గా నాగార్జున సటిల్డ్ కానీ స్టైలిష్ విలన్‌గా కొత్త అవతారంలో కనిపించి ఆకట్టుకున్నాడని వినిపిస్తుంది. ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక సమయాల్లో ఎంట్రీ ఇస్తూ కథకు స్పైస్ జోడించారు. సౌబిన్ షాహిర్ ఆడియన్స్‌ను షాక్ చేసే రోల్‌తో మెప్పించాడట. శృతి హాసన్ డీ-గ్లామర్ పాత్రలో నటనతో ఆకట్టుకుందని.. పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో గ్లామర్ యాడ్ చేసిందనే రివ్యూస్ వస్తున్నాయి.
మొత్తంగా మూడు మెజర్ ట్విస్టులు, ఆరు యాక్షన్ బ్లాకులు ఇవే ‘కూలీ’కి బ్యాక్‌బోన్ అని వినిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై హైప్ పెంచేసి ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌లో ఉంచుతుందనే రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ సినిమా రేంజ్ పెంచి క్లైమాక్స్‌లో హై వోల్టేజ్ ఫీల్ ఇస్తుందని వినిపిస్తుంది.
యాక్షన్ సీన్స్ విజువల్స్ & డిజైన్ పరంగా థియేట్రికల్ అనుభవం ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే కథ ప్రిడిక్టబుల్ అయినా, లోకేష్ కనగరాజ్ ట్రీట్మెంట్, రజనీకాంత్ ఎలివేషన్స్‌తో ఎక్కడా బోర్ అనిపించనివ్వదు అనే పాజిటివ్ టాక్ వస్తోంది.
-
Home
-
Menu