‘కూలీ’ సెన్సేషనల్ కలెక్షన్స్

‘కూలీ’ సెన్సేషనల్ కలెక్షన్స్
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైంది. విడుదలకు ముందే ప్రీమియర్స్ రూపంలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో 3.04 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయి.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైంది. విడుదలకు ముందే ప్రీమియర్స్ రూపంలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో 3.04 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయి. ఇది తమిళ సినిమాలకు ఆల్‌టైమ్ రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’ పోటీ ఉన్నప్పటికీ లిమిటెడ్ థియేటర్లలోనే డబుల్ డిజిట్ షేర్ ఓపెనింగ్స్ సాధించేలా దూసుకెళ్తోంది.

ట్రేడ్ వర్గాల ప్రకారం 'కూలీ' నిర్మాణ వ్యయం రూ.350 కోట్లు. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ఏషియన్ సురేష్ రూ.54 కోట్లకు సొంతం చేసుకున్నారు. బ్రేక్ ఈవెన్‌కు తెలుగు వెర్షన్‌కు రూ.55 కోట్లు షేర్ (రూ.110 కోట్లు గ్రాస్) అవసరం. తమిళనాడు హక్కులు రూ.100 కోట్లు, కేరళ–కర్ణాటక రూ.20 కోట్లు, నార్త్ ఇండియా రూ.50 కోట్లు, ఓవర్సీస్ రూ.85 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.310 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.624 కోట్ల గ్రాస్.

ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికొస్తే తమిళంలో రూ.40 కోట్లు, తెలుగులో రూ.30 కోట్లు, కర్ణాటక–కేరళ–రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.40 కోట్లతో మొత్తం రూ.140–160 కోట్ల మధ్య ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.85 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, మొదటి రోజే 100 కోట్ల క్లబ్ చేరే అవకాశం ఉందని ట్రేడ్ టాక్.

Tags

Next Story