‘కూలీ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది

‘కూలీ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది
X
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కూలీ’.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 14న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

థియేటర్లలో రజనీకాంత్ యాక్షన్, నాగార్జున విలనిజం, ఇతర నటీనటుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు నేపథ్యంలో సాగిన రజనీ–నాగ్ పోరాటం హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 11 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే హిందీ వెర్షన్ తర్వాత రిలీజ్ కానుంది.

Tags

Next Story