జాతీయ అవార్డు విజేతలకు సీఎం సత్కారం

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో అవార్డులు గెలుచుకున్న పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత అవార్డు గ్రహీతలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి, ‘హనుమాన్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, అదే చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు గెలుచుకున్న వెంకట్, శ్రీనివాస్, వారి బృందం, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, ‘బేబి’ సినిమా దర్శకుడు సాయి రాజేష్, గాయకుడు రోహిత్‌లను సీఎం శాలువా కప్పి ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ‘హనుమాన్’ నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, ‘బేబి’ నిర్మాత ఎస్కేఎన్, ‘భగవంత్ కేసరి’ నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు హైదరాబాదును కేంద్ర బిందువుగా నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. సినీ రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని, చిత్ర పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
-
Home
-
Menu