‘బాహుబలి 3’పై క్లారిటీ వచ్చేసింది

‘బాహుబలి 3’పై క్లారిటీ వచ్చేసింది
X
భారతీయ సినిమాకు కొత్త రూపురేఖలు ఇచ్చిన మాగ్నమ్ ఓపస్ ‘బాహుబలి’ తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన ఈ మహాకావ్యాన్ని ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా అక్టోబర్ 31న రీ-రిలీజ్ చేస్తున్నారు.

పదేళ్ల బాహుబలి జ్ఞాపకాలను మరోసారి థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ప్రత్యేక ఎడిషన్ సిద్ధమవుతోంది. రెండు పార్టుల నుంచి కీలక సన్నివేశాలను ఎంచుకుని కొత్తగా కట్ చేసిన ఈ వెర్షన్‌లో కొన్ని పాటలు, సన్నివేశాలు తొలగించబడ్డాయట. ఏవి తీసేశారో, ఏవి ఉంచారో రాజమౌళికే తెలుసని ఆమధ్య రానా సరదాగా చెప్పాడు.

ఇక సినిమా చివరలో ‘బాహుబలి 3’ హింట్ ఉంటుందనే ప్రచారంపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పష్టం చేశారు. ‘అది కేవలం రూమర్ మాత్రమే. కానీ చిన్న సర్ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది‘ అంటూ ఆసక్తిని పెంచారు. అలాగే ‘బాహుబలి 3’ తప్పక వస్తుందనే హామీ కూడా ఇచ్చారు కానీ దానికి ఇంకా సమయం పట్టనుందని తెలిపారు. ఇక ‘ఇది కలెక్షన్ల కోసం కాదు, ఇది ఓ సెలబ్రేషన్‘ అని నిర్మాత పేర్కొనడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి హాజరయ్యే భారీ ప్రమోషనల్ ఈవెంట్‌కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags

Next Story