చిరు-వెంకీ కామెడీ బ్లాస్ట్!

చిరు-వెంకీ కామెడీ బ్లాస్ట్!
X
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ‘మన శంకర వరప్రసాద్ గారు’.

మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ‘మన శంకర వరప్రసాద్ గారు’. టైటిల్ లోనే నాస్టాల్జియా.. కంటెంట్ లో పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోందనే హింట్ అందుతోంది.

నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. చిరు–వెంకీ కాంబోలో వచ్చే కామెడీ ఎపిసోడ్‌పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి హాస్యానికి చిరంజీవి టైమింగ్ కలిస్తే.. థియేటర్లలో పండగ వాతావరణం ఖాయం.

లేటెస్ట్ గా ఈ మూవీ మ్యూజికల్ జర్నీ కూడా మొదలైంది. 'మీసాల పిల్ల' ఫస్ట్ సింగిల్ ఈరోజు సాయంత్రం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రోమోతో ఆకట్టుకున్న ఈ సాంగ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయంలోనూ ఈ మూవీ హీట్ పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ రూ.110–120 కోట్ల రేంజ్‌లో జరగొచ్చని ట్రేడ్ టాక్. ఈ సినిమా వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది.

Tags

Next Story