నాగ్ ను ఫాలో అవ్వనున్న చిరు!

నాగ్ ను ఫాలో అవ్వనున్న చిరు!
X
దశాబ్దాల పాటు హీరోలుగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. తెలుగులో అలాంటి అరుదైన ఘనతను సాధించిన ఈతరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.

దశాబ్దాల పాటు హీరోలుగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. తెలుగులో అలాంటి అరుదైన ఘనతను సాధించిన ఈతరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరంతా హీరోలుగా పరిచయమై దశాబ్దాలు దాటినా.. ఇంకా కథానాయకులుగానే స్క్రీన్ పై మెరుస్తున్నారు. అయితే.. లేటెస్ట్ గా కింగ్ నాగార్జున 'కుబేర' కోసం కొత్త టర్న్ తీసుకున్నాడు.

హీరోగానే ఫిక్సవ్వకుండా 'కుబేర' కోసం క్యారెక్టర్ లో మెరిశాడు. ఇది అక్కినేని ఫ్యాన్స్ కు తొలుత కొంత నిరాశ కలిగించినా ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు మంచి పేరు రావడంతో అభిమానులు కూడా ఆనందంగానే ఉన్నారు. ఇప్పుడు కింగ్ నాగార్జున బాటనే తాను కూడా ఫాలో అవుతానంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.

లేటెస్ట్ గా 'కుబేర' సక్సెస్ మీట్ లో చిత్రబృందాన్ని అభినందించిన చిరు.. ఈ సందర్భంగా నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఇంత బోల్డ్‌గా, అంతగా ఎమోషన్స్‌తో నిండిన పాత్ర చేయడం చాలా ధైర్యంతో కూడుకున్న పని. నా ఫ్రెండ్ నాగార్జున నిజంగా దీపక్ పాత్రలో జీవించాడు. ఆ మార్గాన్నే నేనూ త్వరలో అనుసరిస్తాను' అని తెలిపారు చిరంజీవి.

మొత్తంగా.. వయసు పెరిగినా హీరోలుగానే ఫిక్సవ్వకుండా మన సీనియర్స్ మంచి పాత్రలు చేయడానికి ముందుకొస్తే.. తెలుగులో మనకు మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి.. మెగాస్టార్ ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో మెరిసే సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags

Next Story