చిరు-బాబీ వైల్డ్ స్టేట్‌మెంట్

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ గా వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' గ్లింప్స్, అనిల్ రావిపూడి 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్సెస్ రావడం.. ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడం జరిగింది.
లేటెస్ట్ గా బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకి సంబంధించి అనౌన్స్‌మెంట్ పోస్టర్ వచ్చింది. వెన్నెముకలో వణుకు పుట్టించే స్టేట్‌మెంట్ అంటూ ఈ పోస్టర్ ను షేర్ చేసింది నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్. అలాగే 'బ్లడీ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన బ్లేడ్' అంటూ ఈ సినిమాలో వైలెన్స్ ఏ రేంజులో ఉండబోతుందో ఓ పోస్టర్ తోనే చూపించాడు డైరెక్టర్ బాబీ.
మెగాస్టార్ 158వ చిత్రంగా ఇది రూపొందబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. బాబీ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనూ ఓ వైలెంట్ మూవీ చేయబోతున్నాడు చిరు. నానితో 'ది ప్యారడైజ్' పూర్తైన తర్వాత చిరు సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మొత్తంగా.. బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ లైనప్ యమ క్రేజీగా ఉంది.
-
Home
-
Menu