చిరు-బాబీ కన్ఫమ్!

మెగాస్టార్ చిరంజీవి తనతో పనిచేసిన సాంకేతిక నిపుణులకు అప్పుడప్పుడూ అరుదైన గిఫ్టులతో సర్ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా, దర్శకుడు బాబీ కి చిరంజీవి ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ దీనికి మరో ఎగ్జాంఫుల్. 'వాల్తేరు వీరయ్య' బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరి మధ్య బలమైన స్నేహబంధం కొనసాగుతుండగా, చిరు స్వయంగా బాబీకి ఖరీదైన చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఈ గిఫ్ట్‌ను స్వీకరించిన బాబీ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. 'బాస్ స్వయంగా ఇచ్చిన మెగా సర్‌ప్రైజ్ ఇది. ఈ అమూల్యమైన కానుక నాకు ఎంతో అమూల్యం' అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చిరంజీవి స్వయంగా గడియారాన్ని తొడుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉండగా, 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ-చిరు కాంబోలో మరో సినిమా రానుందన్న వార్తలు ఇటీవల జోరుగా వినిపిస్తున్నాయి. బాబీ సిద్ధం చేసిన కథ చిరంజీవికి నచ్చిందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాక్. బాబీకి చిరంజీవి గిఫ్ట్ ఇవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.
ఫ్యాన్‌గాను, దర్శకునిగా కూడా చిరుతో బంధం ఏర్పరచుకున్న బాబీ.. మరోసారి మెగాస్టార్‌తో పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇది మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.
A beautiful MEGA surprise from the Boss himself 🤩
— Bobby (@dirbobby) May 22, 2025
Thank you dearest Megastar @KChiruTweets garu for this priceless gift 💝
Your love, encouragement, and blessings mean the world to me annaya 🙏 I’ll cherish this moment forever 🤗 pic.twitter.com/pkCXi3SozH
-
Home
-
Menu