ఆర్‌ఎఫ్‌సీలో రఫ్ఫాడించేస్తున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి 'మెగా 157' జెట్ స్పీడులో కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి మూడో షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీలో షురూ అయ్యింది. ఇందులో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
కామెడీ, యాక్షన్ లను సమపాళ్లలో రంగరించి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడట అనిల్. కాస్త గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఈ మూవీలో మళ్లీ తన కామెడీ యాంగిల్ ను చూపించబోతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ మరో కీలక పాత్రలో మెరవబోతుంది. ముఖ్యంగా ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నాడు.
ఈ చిత్రానికి 'రఫ్ఫాడించేద్దాం' అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఆగస్టు 22న ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి బరిలో 'మెగా 157' రిలీజ్ కానుంది.
-
Home
-
Menu