తప్పుడు ప్రచారాన్ని ఖండించిన చిరంజీవి

తప్పుడు ప్రచారాన్ని ఖండించిన చిరంజీవి
X
తెలుగు సినీ పరిశ్రమలో 30% వేతన పెంపు అంశంపై మీడియాలో వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు.

తెలుగు సినీ పరిశ్రమలో 30% వేతన పెంపు అంశంపై మీడియాలో వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. “నేను ఫిల్మ్ ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. వారి డిమాండ్లను అంగీకరించానని చెప్పడం పూర్తిగా తప్పుడు సమాచారం” అని ఆయన స్పష్టం చేశారు.

చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో “ఇది మొత్తం పరిశ్రమకు సంబంధించిన విషయం. ఎవరి తరపునైనా నేను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. ఫిల్మ్ ఛాంబర్‌నే ఈ సమస్యను అన్ని వర్గాలతో చర్చించి పరిష్కరించగల అగ్ర సంస్థ” అని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.



Tags

Next Story