చరణ్ Vs నాని ఫిక్స్

చరణ్ Vs నాని ఫిక్స్
X
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ కంటిన్యూస్ గా సాగుతుంది.

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ కంటిన్యూస్ గా సాగుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రంలోని కీలకమైన ఓ హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు.

ఈ షూట్ లో నానితో పాటు విలన్ గా కనిపించబోయే 'కిల్' ఫేమ్ రాఘవ్ జుయల్ కూడా పాల్గొంటున్నాడు. అలాగే 'ది ప్యారడైజ్'లో విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా ఉన్నాడనే సంకేతం ఓ లీక్డ్ ఫోటో ద్వారా బయటపడింది. మొత్తంగా.. నాని ఈసారి ఊర మాస్ లుక్ లో కనిపిస్తూ 'ది ప్యారడైజ్'తో మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రం వచ్చే యేడాది మార్చి 26న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కూడా 'ది ప్యారడైజ్' వచ్చిన ఒక రోజుకే ఆడియన్స్ ముందుకు వస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో నిర్మాతలు ఆ తేదీని ఫిక్స్ చేశారు. దీంతో ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తలపడతుండటం సినీ వర్గాల్లోనే కాదు ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశమైంది.

ఈ విషయంపై గతంలోనే స్పందించిన నాని, 'సినిమాలు పోటీ పడడం సహజం. ఆ పోటీ పరిశ్రమలో కొత్త ఉత్సాహం నింపుతుంది. పైగా 'పెద్ది' లాంటి సినిమా మొత్తం ఇండస్ట్రీకే బలం' అని అన్నాడు. అయితే విడుదల తేదీలపై తాను నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదని, నిర్మాతలపై అది ఆధారపడిందని స్పష్టం చేశాడు.

ఇక చరణ్, నాని క్లాష్ మాత్రమే కాదు.. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యులైన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల క్లాష్ గా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. అయితే ఇంకా విడుదలకు ఎనిమిది నెలల సమయం ఉండటంతో తేదీల్లో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు. చివరికి నిజంగా ఈ బాక్సాఫీస్ క్లాష్ జరుగుతుందా? లేదంటే ఒకటి వెనక్కి వెళ్లుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Tags

Next Story