చరణ్-త్రివిక్రమ్ కాంబో?

'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, ఆ తర్వాతి సినిమాలైన ‘ఆచార్య, గేమ్ ఛేంజర్’తో కొంత నిరాశపరిచాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పెద్ది'తో మళ్లీ మాస్‌కి చేరువ కావాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్ డే స్పెషల్ గా ‘పెద్ది‘ రిలీజ్ కాబోతుంది.
ఇదిలా ఉండగా, చరణ్ తన 17వ సినిమాని క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌తో ప్లాన్ చేశాడు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కొంత వెనక్కి వెళ్లి.. త్రివిక్రమ్ సినిమా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ‘RC17’కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనుండగా, ‘RC18’ను సుకుమార్ చేయనున్నాడనేది ఇండస్ట్రీ టాక్.
వాస్తవానికి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ ఫాంటసీ చిత్రం రావాల్సి ఉంది. కానీ బన్నీ, ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి డైరెక్టర్ అట్లీతో సినిమా మొదలుపెట్టాడు. ఈనేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఫోకస్‌ను చరణ్ సినిమాపైకి మళ్లించినట్టు తెలుస్తోంది.
ఈ కాంబో వెనుక పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉందని ఇండస్ట్రీ టాక్. పవన్ - త్రివిక్రమ్ మధ్య స్నేహం తెలిసిందే. పవన్ సూచన మేరకే చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ దిశగా చర్చలు జరిగినట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ తో కూడా ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ, చరణ్ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్లేలా సూచనలు కనిపిస్తున్నాయి.
-
Home
-
Menu