చిరంజీవిని కలిసిన సి.కళ్యాణ్

టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెపై నిర్మాత సి.కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలసి సమస్యపై చర్చించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
‘ప్రతిరోజూ ఈ సమస్య పరిష్కారం కావాలని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు చిరంజీవి గారు. రేపు ఫెడరేషన్ నాయకులు కూడా ఆయనను కలవనున్నారు. నిర్మాతల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు‘ అని ఆయన తెలిపారు.
‘తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. నాకు ఉన్న అనుభవంతో కొన్ని ప్రాక్టికల్ ఇష్యూలను వివరించాను. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడి కార్మికుల టారీఫ్ ఎక్కువగానే ఉంది. కానీ చిరంజీవి గారు పెద్దమనసుతో ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా ఆలోచిస్తున్నారు‘ అని కళ్యాణ్ అన్నారు.
‘నిర్మాతల బలహీనతల వల్లే ఈ సమస్యలు పెరుగుతున్నాయి. కానీ ఇవి పెద్ద సమస్యలు కావు, వర్కర్స్‌ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. లేబర్ కమిషనర్ రికార్డు రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయడం సాధ్యం కాదు. అయితే మనం ఒక కుటుంబంలా కలిసి పని చేయడం అలవాటు చేసుకున్నాం. కాబట్టి త్వరలో ఈ ఇష్యూ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాను‘ అని సి.కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
-
Home
-
Menu