అట్లీ కోసం బన్నీ ప్రయోగం!

అట్లీ కోసం బన్నీ ప్రయోగం!
X
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే విభిన్నమైన ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు. ‘పుష్ప 2’ తర్వాత అట్లీ డైరెక్షన్ లో సినిమాని ప్రారంభించాడు బన్నీ.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే విభిన్నమైన ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు. ‘పుష్ప 2’ తర్వాత అట్లీ డైరెక్షన్ లో సినిమాని ప్రారంభించాడు బన్నీ. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రం రూపొందనుందనే సంగతిని ఇప్పటికే ప్రకటించింది టీమ్.

లేటెస్ట్ గా బన్నీ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసే ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపించనున్నాడట. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ నటించనున్నట్టు తెలుస్తోంది. మొదట ట్రిపుల్ రోల్ అని ప్రచారం జరిగినా, ఇప్పుడు మాత్రం నాలుగు రోల్స్ లో ఐకాన్ స్టార్ అలరిస్తాడనే టాక్ సాగుతోంది.

ఈ సినిమా కథ ప్యారలల్ వరల్డ్, పునర్జన్మల కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. హాలీవుడ్ రేంజులో తెరకెక్కుతోన్న ఈ సినిమాకోసం పలు ఇంటర్నేషనల్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. హీరోయిన్ల విషయానికొస్తే.. దీపికా పదుకొణెను అధికారికంగా ప్రకటించిన టీమ్‌ ఇంకా మిగిలిన హీరోయిన్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ మూవీలో ఇంకా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా, భాగ్యశ్రీ బోర్సే నాయికలుగా కనిపించనున్నారు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం 2027లో రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story