నిర్మాత రత్నంకు పవన్ బంపరాఫర్

X
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నానికి ప్రత్యేక గౌరవం ఇచ్చారు.
పవన్ మాట్లాడుతూ 'నాకు ఇష్టమైన నిర్మాత ఏఎం రత్నం. తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పుడూ అండగా నిలిచే ఆయనకు నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అందుకే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ఆయన పేరును ప్రతిపాదించాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని తెలియజేశాను' అని వెల్లడించారు.
'నా నిర్మాతకోసం కాదు, అన్ని భాషల హీరోలతో సినిమాలు చేసిన ఆయన పాన్ ఇండియా పరిచయాలు పరిశ్రమకు ఉపయోగపడతాయి. నా పరిధిలో ఉన్న శాఖ కాబట్టి ఆయన పేరును సూచించాను' అని పవన్ అన్నారు.
Next Story
-
Home
-
Menu