‘జైలర్ 2’లో బాలయ్య పవర్‌ఫుల్ ఎంట్రీ!

‘జైలర్ 2’లో బాలయ్య పవర్‌ఫుల్ ఎంట్రీ!
X

‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ నటన, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం, అనిరుద్ సంగీతం అన్నీ కలిసి 'జైలర్'ని బ్లాక్‌బస్టర్ చేశాయి. ప్రస్తుతం 'జైలర్' సిరీస్ లో మరో చిత్రం రాబోతుంది. ఈ సినిమా 'జైలర్'కి ప్రీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది.

ఇక 'జైలర్'లో గెస్ట్ అప్పీరెన్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'జైలర్'లో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక కేమియోస్ లో అలరించారు. ఇప్పుడు 'జైలర్ 2' కోసం టాలీవుడ్ నటసింహం బాలకృష్ణను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈనేపథ్యంలో తమిళంలో 'డాకు మహారాజ్'ని నెల్సన్ ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాడనే ప్రచారమూ ఉంది.

'జైలర్ 2'లో బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ పోలీస్ రోల్ ను డిజైన్ చేశాడట. ఆ పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉంటుందట. ఇటీవల ‘జైలర్ 2’కి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. రజనీకాంత్ మాస్ అప్పియరెన్స్‌తో ఈ టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇప్పుడు 'జైలర్ 2'లో బాలయ్య అతిథి పాత్రలో మెరవబోతున్నాడన్న న్యూస్ ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొస్తుంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'టైగర్' సినిమాలో రజనీకాంత్ నటించాడు. ఇప్పుడు రజనీకాంత్ తో బాలయ్య నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags

Next Story