బాలయ్య డబుల్ ట్రీట్!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ రెడీ అయ్యింది. వీటిలో ఒకటి బాలయ్య కొత్త సినిమా ప్రకటన కాగా.. మరొకటి ‘అఖండ 2‘ టీజర్ అప్డేట్. ఇప్పటికే బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి‘ వంటి అద్భుతమైన విజయాన్ని అందించిన మలినేని గోపీచంద్.. మరోసారి గాడ్ ఆఫ్ మాసెస్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హిస్టారికల్ రోర్ బిగిన్స్ అంటూ ‘ఎన్.బి.కె. 111‘ అప్డేట్ అందించారు మేకర్స్.
మరోవైపు బాలయ్య మోస్ట్ అవైటింగ్ మూవీ ‘అఖండ 2‘ నుంచి టీజర్ అప్డేట్ వచ్చేసింది. బాలకృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఒకరోజు ముందుగానే.. అంటే జూన్ 9న సాయంత్రం 6.03 గంటలకు ‘అఖండ 2‘ టీజర్ రాబోతుంది. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అయితే.. ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ వేయలేదు. దీంతో.. ముందుగా అనుకున్న దసరా బరిలో ‘అఖండ 2‘ వస్తోందా? లేక ముందుగానే ఆడియన్స్ ముందుకు రానుందా? అనేది రేపు విడుదలయ్యే టీజర్ లో తెలిసే అవకాశం ఉంది.
-
Home
-
Menu