వరద బాధితులకు బాలయ్య అండ

X
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదలు కొన్ని జిల్లాలలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల భారీ విధ్వంసం సంభవించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదలు కొన్ని జిల్లాలలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల భారీ విధ్వంసం సంభవించింది. ఈ విపత్తు కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తన వంతు సహాయాన్ని అందిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణ.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. జరిగిన నష్టం దృష్ట్యా ఉడత భక్తిగా రూ.50 లక్షలు డొనేట్ చేస్తున్నాను. ఇక ముందు కూడా ఇలా నా సహకారం ఉంటుంది' అన్నారు.
Next Story
-
Home
-
Menu