సంక్రాంతి బరిలో బాలయ్య?

మిగతా సీజన్లలో కంటే సంక్రాంతి బరిలో నటసింహం బాలకృష్ణ దూకుడు మామూలుగా ఉండదు. సంక్రాంతి సీజన్లలో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న క్రెడిట్ బాలయ్య సొంతం. ఇప్పుటికే పదుల సార్లు సంక్రాంతి స్లాట్ లో పోటీపడ్డ బాలకృష్ణ.. ఇప్పుడు మరోసారి సంక్రాంతి రేసులోకి దూసుకెళ్లబోతున్నాడు.
బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ 'అఖండ 2' దసరాకి విడుదల కావాల్సి ఉంది. అయితే.. షూటింగ్ ఇంకా ఆలస్యమవుతుండటంతో ఆ సమయానికి చిత్రం పూర్తవ్వడమే కష్టమే అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ 'ఓజీ' దసరాకి ఫిక్సయ్యింది. ఈనేపథ్యంలో.. 'అఖండ 2' సంక్రాంతి బరిలోకి షిప్ట్ అయ్యిందనేది లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్.
ఒకవేళ అదేగానీ జరిగితే వచ్చే సంక్రాంతి బరిలో లెజెండరీ క్లాష్ మరోసారి కన్ఫమ్ అయినట్టే. అదే చిరంజీవి-బాలకృష్ణ మధ్య మరోసారి సంక్రాంతి వార్. దశాబ్దాల నుంచి స్టార్ వార్ కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పలుమార్లు పోటీలో ఉన్నా.. సంక్రాంతి సీజన్ లో అయితే ఇప్పటివరకూ తొమ్మిది సార్లు తలపడ్డారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా వచ్చే సంక్రాంతి బరిలో విడుదల తేదీ ఖరారు చేసుకుంది. లేటెస్ట్ గా పట్టాలెక్కిన 'మెగా 157' సంక్రాంతికి పక్కాగా వచ్చేస్తోంది. ఇప్పుడు బాలయ్య 'అఖండ 2' కూడా సంక్రాంతికి వస్తే.. 2026 సంక్రాంతి సీజన్ సమ్థింగ్ స్పెషల్ గా నిలవబోతుంది.
మరోవైపు తమిళం నుంచి విజయ్ 'జననాయగన్' కూడా పొంగల్ రేసులో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 2023 సంక్రాంతి బరిలో చిరు 'వాల్తేరు వీరయ్య', బాలయ్య 'వీరసింహారెడ్డి'లతో పాటు విజయ్ 'వారసుడు' విడుదలైన విషయం తెలిసిందే. అంటే.. ఈ ముగ్గురూ మరోసారి 2026 సంక్రాంతి బరిలో తలపడబోతున్నారన్నమాట.
-
Home
-
Menu