జూన్ నుంచి 'బేబీ' కాంబో!

జూన్ నుంచి బేబీ కాంబో!
X
'బేబీ' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి స్క్రీన్‌పై మెరవబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ప్రొడక్షన్ 32గా ఈ చిత్రం రూపొందుతుంది.

'బేబీ' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి స్క్రీన్‌పై మెరవబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ప్రొడక్షన్ 32గా ఈ చిత్రం రూపొందుతుంది.'90's మిడిల్ క్లాస్ బయోపిక్ తో ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

అసలు '90's మిడిల్ క్లాస్ బయోపిక్ కి సీక్వెల్ గానే ఈ చిత్రం ఉంటుందని ఆమధ్య మేకర్స్ ప్రకటించారు. ఈసారి ఆనంద్, వైష్ణవి లతో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఆవిష్కరించనున్నాడట ఆదిత్య హాసన్. గురువారం ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

పూజా కార్యక్రమానికి ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న క్లాప్ కొట్టగా, శివాజీ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరి స్క్రిప్ట్ అందించగా, కళ్యాణ్ శంకర్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వబోతుంది. మొత్తంగా.. 'బేబీ' తర్వాత ఇప్పుడు అంతకుమించి హిట్ కొట్టాలని చూస్తున్నారు ఆనంద్, వైష్ణవి.


Tags

Next Story