‘బాహుబలి.. ది ఎపిక్‘ టీజర్

X
పదేళ్ల క్రితం విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' భారతీయ సినిమా స్థాయిని కొత్త మైలురాయికి తీసుకెళ్లింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మేగ్నమ్ ఓపస్, 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్'తో కలిసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి, తెలుగు సినిమాను పాన్-ఇండియా స్థాయిలో నిలిపింది.
పదేళ్ల క్రితం విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' భారతీయ సినిమా స్థాయిని కొత్త మైలురాయికి తీసుకెళ్లింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మేగ్నమ్ ఓపస్, 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్'తో కలిసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి, తెలుగు సినిమాను పాన్-ఇండియా స్థాయిలో నిలిపింది. ప్రస్తుతం 'బాహుబలి' రెండు పార్టులు కలిపి 'బాహుబలి.. ది ఎపిక్'గా రాబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా 'బాహుబలి.. ది ఎపిక్' టీజర్ వచ్చింది.
1 నిమిషం 17 సెకన్ల నిడివితో వచ్చిన ఈ స్పెషల్ టీజర్ ఆకట్టుకుంటుంది. రెండు భాగాలను కలిపి రీ మాస్టర్డ్, రీ కట్ తో మూడున్నర గంటల నిడివితో ‘బాహుబలి.. ది ఎపిక్‘ను తీసుకొస్తున్నారట మేకర్స్. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదలకానుంది.
Next Story
-
Home
-
Menu