‘బాహుబలి: ది ఎపిక్’ వస్తోంది!

‘బాహుబలి: ది ఎపిక్’ వస్తోంది!
X
భారతీయ సినిమా చరిత్రను ఓ మలుపు తిప్పిన చిత్రం ‘బాహుబలి’. ఈ మాగ్నమ్ ఓపస్ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది.

భారతీయ సినిమా చరిత్రను ఓ మలుపు తిప్పిన చిత్రం ‘బాహుబలి’. ఈ మాగ్నమ్ ఓపస్ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. 'బాహుబలి' సిరీస్ రెండు చిత్రాలూ ఇప్పుడు ఒకే సినిమాగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందంతో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా అధికారికంగా ప్రకటించాడు.

‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017) సినిమాలు కలిపి రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. నైజాంలో ఏసియన్ సురేష్ సంస్థ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వారాహి, నార్త్ ఇండియాలో ఎ.ఎ.ఫిల్మ్స్ ఇండియా విడుదల చేయనున్నాయి. జపాన్, ఫ్రాన్స్, అమెరికా మార్కెట్లకూ ప్రత్యేకంగా విడుదల జరగనుంది.

ఇప్పుడు 'బాహుబలి' రీ-రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో ‘#బాహుబలివస్తున్నాడు’ అనే తెలుగు హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. కీరవాణి సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫీ, విజయేంద్ర ప్రసాద్ కథ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.



Tags

Next Story