విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు
X
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నాడు. తమిళ నటుడు సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలను గిరిజన సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నాడు. తమిళ నటుడు సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలను గిరిజన సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న విజయ్, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్–పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించాడు.

ఈ సందర్భంగా 'పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద ఎటాక్ చేస్తారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి' అని అన్నాడు.

ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు నిరసనలు చేపట్టగా, పలుచోట్ల విజయ్‌ దేవరకొండపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో గిరిజన సంఘ నేత అశోక్ కుమార్ రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ నేతృత్వంలో ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామంపై విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story