అర్జున్ సర్కార్ ఊచకోత!

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'హిట్ 3: ది థర్డ్ కేస్'. తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'హిట్' సిరీస్‌లో మూడవ భాగంగా ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ చిత్రంలో నాని 'అర్జున్ సర్కార్'గా పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే మూడున్నర నిమిషాల అర్జున్ సర్కార్ ఊచకోత అని చెప్పొచ్చు. వరుస హత్యలు, అర్జున్ సర్కార్ వాటిని ఎలా చేధించాడు? అనే కోణంలో 'హిట్ 3' ఉండబోతుంది. ఇక ఈ ట్రైలర్ లో బ్లడ్ బాత్ ఓ రేంజులో ఉంది. క్రిమినల్స్ పాలిట సింహస్వప్నంగా మారి అర్జున్ సర్కార్ చేసే వీర విహారం స్క్రిన్ ను ఎరుపెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, కోమలి ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమాస్ పై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
-
Home
-
Menu