‘ఓజీ‘ ప్రీమియర్ షోస్ లేనట్టేనా?

ఈ సెప్టెంబర్ నెల టాలీవుడ్ కి బాగా కలిసొస్తుంది. ఈనెలలో ఇప్పటివరకూ వచ్చిన ‘లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, మిరాయ్‘ చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇదే ఊపులో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ థియేటర్లలోకి రాబోతుంది. దసరా హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ 25న ‘ఓజీ‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.
సుజీత్ తన అభిమాన హీరో కోసం రూపొందించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. తమన్ యూనిక్ స్టైల్ లో అందించిన మ్యూజిక్ ఇప్పటికే ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. అయితే.. ‘ఓజీ‘ ప్రీమియర్ షోల విషయంలో మాత్రం నిరాశాజనకమైన వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు సెప్టెంబర్ 24నే ప్రీమియర్లు ఉంటాయని బజ్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం 24వ తేదీ రాత్రి షోలు లేకపోవచ్చని.. 25వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి లేదా ఉదయం 4 గంటల నుంచి మాత్రమే స్క్రీనింగ్స్ మొదలవుతాయని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం చేరిందని టాక్. ఈ విషయంపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరోవైపు ఈ మూవీ ట్రైలర్ లాంఛ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి వేడుకులకు సన్నాహాలు చేస్తుంది టీమ్.
-
Home
-
Menu