అనుష్క ప్రమోషన్స్ కు దూరం.. కారణం?

స్వీటీ అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ 'ఘాటి'. ఒకప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన అనుష్క.. ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా తగ్గించింది. ఓన్లీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఏడాదికి, రెండేళ్లకు ఒక సినిమా చేస్తుంది. లేటెస్ట్‌గా అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన 'ఘాటి' సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వస్తుంది.
గంజాయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అనుష్క ఓ శక్తివంతమైన గిరిజన మహిళగా కనిపించనుంది. ‘వేదం’ తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం వల్ల కూడా 'ఘాటి'పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలూ బాగా ఆకట్టుకున్నాయి.
'ఘాటి' తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు అని తెలుస్తోంది. ఫస్టాఫ్ ఎమోషనల్ జర్నీ గా సాగే ఈ చిత్రం.. సెకండాఫ్ లో పవర్ ఫుల్ యాక్షన్ తో ఆకట్టుకోనుందని సెన్సార్ టాక్. అనుష్క, క్రిష్ ఇద్దరికీ ఇది బెస్ట్ కమ్ బ్యాక్ అవుతుందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
మరోవైపు ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. అదేమిటంటే ‘ఘాటి’ ప్రమోషన్లలో అనుష్క ఎక్కడా కనిపించడం లేదు అని. దీనిపై నిర్మాత రాజీవ్ రెడ్డి స్పందిస్తూ.. 'అనుష్క ప్రమోషన్లలో పాల్గొనబోనని షూటింగ్‌కి ముందే చెప్పింది. ఆ మేరకు ఒప్పందం కుదిరింది. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం, మేము కూడా గౌరవించాలి' అని క్లారిటీ ఇచ్చారు.
గతంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సమయంలో కూడా అనుష్క ప్రమోషన్లకు దూరంగానే ఉంది. ఆ సమయంలో హీరో నవీన్ పోలిశెట్టి ఒక్కడే మొత్తం ప్రచారం భారం మోశాడు. ఇక అనుష్క ప్రచారానికి దూరం కావడం వెనుక వ్యక్తిగత కారణాలా? ఇతర సినిమాల కమిట్‌మెంట్సా? లేక బరువు పెరగడంపై వచ్చే ట్రోల్స్ భయమా? అంటూ రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. మొత్తంగా.. ప్రమోషన్స్‌లో అనుష్క లేకపోయినా, ఆమె ఇమేజ్ ఓపెనింగ్స్‌ను బలంగా తేవడంలో సహాయపడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.
-
Home
-
Menu