పవన్ కిట్టీలో మరో ప్రాజెక్ట్?

పవన్ కిట్టీలో మరో ప్రాజెక్ట్?
X
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమపాళ్లలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన స్టైల్‌లో సాగుతున్నాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమపాళ్లలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన స్టైల్‌లో సాగుతున్నాడు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు, ఓజి, 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న పవన్, లేటెస్ట్ గా మరో మూవీని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఎన్నికల ముందు ఒప్పుకున్న చిత్రాల జాబితాలో 'వీరమల్లు, ఓజీ, ఉస్తాద్..'లతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీరామ్ తాళ్లూరి నిర్మిస్తారని అధికారికంగా ప్రకటించారు. కానీ అనేక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవల సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని స్క్రిప్ట్ పూర్తయ్యిందని తెలిపాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ మొదలవ్వబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాకముందే, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేక ఈ సినిమా కూడా రాజకీయ ప్రాధాన్యత కారణంగా మరోసారి వెనక్కి వెళ్లిపోతుందా? అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

Tags

Next Story