మహేష్ బాబు నుంచి మరో మల్టీప్లెక్స్

మహేష్ బాబు నుంచి మరో మల్టీప్లెక్స్
X
హైదరాబాద్ నగరంలో సినిమా చూడటమంటే ఇప్పుడు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పుడు మరోసారి థియేటర్ అనుభవాన్ని రీడిఫైన్ చేయబోతున్నాడు.

ఇప్పటికే గచ్చిబౌలిలోని AMB సినిమాస్ తో సినీ ప్రేమికుల గుండెల్లో స్థానం సంపాదించిన మహేష్ బాబు, ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో AMB క్లాసిక్ పేరుతో కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో సుదర్శన్ 70MM థియేటర్ ఉన్న ప్రదేశంలోనే ఈ అద్భుతమైన మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది.

ఏకంగా 7 స్క్రీన్స్‌తో, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఈ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ప్రతి సీటింగ్‌ డిజైన్‌ కూడా ప్రత్యేకంగా, ప్రేక్షకులకు మైండ్‌బ్లోయింగ్ సినిమాటిక్ అనుభవం ఇచ్చేలా ఉండబోతోందట. ఈ మల్టీప్లెక్స్‌ను 2026 సంక్రాంతి కానుకగా ఓపెన్ చేయనున్నారు. మరోవైపు ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29తో గ్లోబల్ లెవెల్ లో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా 2027లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Tags

Next Story